ఆ సమయంలో కొందరు నాపై దాడి చేశారు.. అసలు నిజాలు బయటపెట్టిన హీరామండి డైరెక్టర్

by Hamsa |   ( Updated:2024-10-11 14:45:39.0  )
ఆ సమయంలో కొందరు నాపై  దాడి చేశారు.. అసలు నిజాలు బయటపెట్టిన హీరామండి డైరెక్టర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా తెరకెక్కిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన ‘హీరామండి’(Hiramandi )సిరీస్‌తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఓటీటీలను సైతం షేక్ చేశారనడంలో అతిశయోక్తి లేదు. హీరామండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రజెంట్ హీరామండి-2 (Hiramandi -2)పనుల్లో సంజయ్ ఫుల్ బిజీగా ఉన్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్ లీలా భన్సాలీ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘దీపికా పదుకొణె(Deepika Padukone) హీరోయిన్‌గా వచ్చిన ‘పద్మావతి’ తెరకెక్కిస్తున్న సమయంలో షూటింగ్ జరుగుతుండగా నాపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. శారీరకంగా మానసికంగా నా భావోద్వేగాలను దెబ్బతీయాలని చూశారు కానీ వాటి ప్రభావం తెరపై పడకుండా జాగ్రత్త పడ్డాను. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండి సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఏది చేయాలనుకున్నానో అదే చేశాను. ఏదైనా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తాను. ఏది తప్పు ఏది ఒప్పు అని శాంతంగా ఆలోచించుకుంటాను. ఎన్ని అవమానాలు ఎదురైనా నా సినిమాపై వాటి ప్రభావాన్ని పడనీయను.

ప్రతీ కళాకారుడు ఏదో ఒక సమయంలో అవమానాలను భరించాల్సిందే. ఆ సినిమా సమయంలో జరిగిన దాడుల కారణంగా విడుదల చాలా సార్లు వాయిదా పడింది. అనేక కోర్టుల్లో పలు కేసులు కూడా దాఖలయ్యాయి. అయినప్పటికీ సినిమా మాత్రం ఘన విజయం సాధించింది. అందుకు చాలా సంతోషపడ్డాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న వారు ఆలోచనలో పడ్డారు. అసలు ఆయనపై దాడి చేసింది. దీపికా ఫ్యాన్స్ అయి ఉండవచ్చు అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story