- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Israel-Hezbollah: లెబనాన్ పై మరోసారి విరుచుకుపడ్డ ఇజ్రాయెల్
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఇజ్రాయెల్- లెబనాల్‌ల మధ్య యుద్ధం ఉద్రిక్తతంగా మారింది. కాగా.. లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా.. 117 మంది గాయపడ్డారు. ‘లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 22 మంది మృతిచెందగా.. 117 మంది గాయపడ్డారు’ అని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటనలో వెల్లడించింది.
యూఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడి
ఇదిలాఉండగా.. యూఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలపై పదే పదే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో ఇద్దరు చనిపోయారు. కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తుంది. యూఎన్ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణమంత్రి గైడో క్రోసెట్టో ఖండించారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామన్నారు. స్పెయిన్ దీనిని "అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘన" అని పేర్కొంది. ఈ దాడులపై వాషింగ్టన్ సైతం స్పందించింది. హెజ్‌బొల్లా సౌకర్యాలను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసే సమయంలో యూఎన్ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో యూఎన్ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యూఎన్ సూచించింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఇజ్రాయెల్ సెప్టెంబర్ 23 నుండి లెబనాన్‌లోని హిజ్ బొల్లాపై దాడి చేస్తోంది.