Tirumala Tirupati Devasthanams : తిరుమలలో వైభవంగా రథోత్సవం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-11 17:01:13.0  )
Tirumala Tirupati Devasthanams : తిరుమలలో వైభవంగా రథోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం మహా రధోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో రథంపై విహరించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జగత్ రక్షుకుడైన శ్రీవారిని దర్శించుకుని గోవింద నామస్మరణల మధ్య రథాన్ని లాగి తరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల పర్వంలో

శుక్రవారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీంతో వాహన సేవలు పూర్తి కానున్నాయి. శనివారం చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే తితిదే ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిలో భక్తుల నియంత్రణకు భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Read More...

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు...

Advertisement

Next Story

Most Viewed