France: ఫ్రాన్సులో దారుణం.. భార్యను 50 మందితో అత్యాచారం చేయించిన భర్త

by Maddikunta Saikiran |
France: ఫ్రాన్సులో దారుణం.. భార్యను 50 మందితో అత్యాచారం చేయించిన భర్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్సు(France)లో దారుణం చోటు చేసుకుంది.ఓ భర్త తన భార్యపై 50 మంది పురుషులతో అత్యాచారం చేయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందుతుడు 71 ఏళ్ల , ఫ్రాన్స్‌లోని పవర్ యుటిలిటీ ఇడిఎఫ్‌ (EDF)లో మాజీ ఉద్యోగి.తన 70 ఏళ్ల భార్య పట్ల కొన్ని సంవత్సరాల పాటు అత్యంత క్రూరంగా వ్యవరించాడు.రాత్రి సమయంలో ఆమె తినే ఫుడ్ లో మత్తుమందు కలిపేవాడు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్న తర్వాత తాము నివసిస్తున్న ఫ్రెంచ్ గ్రామమైన మజాన్‌(Mazan)లోని తన ఇంటికి పలువురు అపరిచితులను పిలిచి ఆమెపై అత్యాచారం చేయించాడు.నిందితుడు కూడా అత్యాచారాలలో పాల్గొన్నాడు. వారు తన భార్యను రేప్ చేసే సమయంలో రహస్య కెమెరాల్లో రికార్డ్ చేశాడు.కాగా అపరిచిత వ్యక్తులను నియమించుకోవడానికి ప్రధాన నిందుతుడు coco.fr అనే సైట్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే ప్రధాన నిందితుడైన మహిళ భర్త సెప్టెంబరు 2020లో ఓ షాపింగ్ సెంటర్‌లో ముగ్గురు మహిళలతో అసభ్యకర చర్యలకు ఒడిగట్టాడు.అతను మహిళల వీడియోలను రహస్యంగా తీస్తుండగా.. సెక్యూరిటీ గార్డులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించడం ప్రారంభించారు.విచారణలో భాగంగా పోలీసులు అతని కంప్యూటర్‌ను పరీశీలించగా అందులో అతని భార్య యొక్క వేలాది ఫోటోలు , వీడియోలు లభించాయి. అవి ఆమె మత్తులో ఉన్నప్పుడు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు.దీంతో పోలీసులు అసలు విషయం తెలుసుకొని కంగుతిన్నారు.2011-2020 మధ్య ఈ దారుణాలు చోటు చేసుకున్నాయని, దాదాపు 50 మంది వరకు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ,ఈ కేసు విచారణ డిసెంబర్ వరకు జరగనుందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed