అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-25 03:32:41.0  )
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్టయిన 20 నిమిషాల్లోనే ఆయన విడుదలయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ట్రంప్ ను అట్లాంటా పోలీసులు అరెస్ట్ చేశారు. 20 నిమిషాల పాటు జైల్లోనే ట్రంప్ గడిపారు. 2 లక్షల డాలర్ల పూచికత్తుపై ట్రంప్ విడుదలయ్యారు. అరెస్ట్ పై స్పందించిన ట్రంప్ తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఎన్నికల క్యాంపెయిన్ కోసం ట్రంప్ తన ప్రైవేట్ జెట్ లో ప్రయాణించేందుకు రెడీ అవగా పోలీసులు ట్రంప్ ను అరెస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేయడం పట్ల జో బైడెన్ పై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఫాల్కన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ మాట్లాడుతూ.. ట్రంప్ ఓడిపోయిన తర్వాత కూడా అధికారం కోసం జార్జియా రాకెట్రింగ్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.

Advertisement

Next Story