- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. పాక్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్‌లో అదుపులోకి తీసుకుంది. మార్చి 7వ తేదీన ఇమ్రాన్ ఖాన్‌పై ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా ఇవాళ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేస్తుండగా కోర్టులో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ లాయర్లకు గాయాలయ్యాయి. ఉద్రిక్తల నేపథ్యంలో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసిన పాక్ ఆర్మీ.. అతడిని రహస్య ప్రాంతానికి తరలించింది.
ఇక, ఇమ్రాన్ ఖాన్‌పై దేశవ్యాప్తంగా 85కు పైగా కేసులు నమోదైనట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆయన అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఇటీవల కూడా అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన ఇమ్రాన్ ఖాన్.. బెయిల్‌పై బయటికొచ్చారు. ఇదిలా ఉండగానే పాక్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయడంతో తనను హత్య చేసే కుట్ర జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.