- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bangladeshis : బెంగాల్‌లోకి ప్రవేశించేందుకు 600 మంది బంగ్లాదేశీయుల యత్నం
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఆ దేశం నుంచి దాదాపు 600 మంది భారత్‌లోకి ప్రవేశించేందుకు విఫల యత్నం చేశారు. వారిని పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా దక్షిణ్ బెరూబరి గ్రామం సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకొని వెనక్కి పంపించాయి. ఈక్రమంలో సదరు బంగ్లాదేశీయులు తమను ఇండియాలోకి రావడానికి అనుమతించాలంటూ బీఎస్ఎఫ్ సిబ్బందిని వేడుకున్నారు.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాకాండలో తమ ప్రాణాలకు ఏదైనా జరుగుతుందనే భయంతోనే భారత్‌లోకి వలస వస్తున్నామని వారు చెప్పడం గమనార్హం. తమ దేశంలో దుర్భర పరిస్థితులను చవిచూశామని సదరు బంగ్లాదేశీయులు పేర్కొన్నారు. వచ్చిన చోటుకే తిరిగి వెళ్లిపోవాలని బీఎస్ఎఫ్ సిబ్బంది వారిస్తున్నా కొంతమంది బంగ్లాదేశ్ పౌరులు ఇంకా బార్డర్ ఏరియాలోనే తిరుగుతున్నట్లు గుర్తించారు. విద్యార్థుల నిరసన ఉద్యమం ధాటికి తాళలేక ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.