- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా: ఎలాన్ మస్క్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ట్రంప్‌కు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. అలాగే మస్క్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల సామర్థ్యాన్ని కూడా ప్రశ్నించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఏమైనప్పటికీ, సీక్రెట్ సర్వీస్ నాయకత్వం రాజీనామా చేయాలని మస్క్ ఎక్స్‌లో రాశారు. ఆయన వ్యాఖ్యలకు ఒక యూజర్ అతని పోస్ట్‌లో పూర్తిగా సాయుధమైన వ్యక్తి పోడియం దగ్గరకు ఎలా అనుమతించబడతారని కామెంట్ చేశాడు.
ఇదిలా ఉంటే ట్రంప్‌పై చేసిన కాల్పులు పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినట్లు తెలుస్తుంది. కాల్పుల ఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు నిందితుడిని చూశానని, అతని గురించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌కు చెప్పినా వారు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఒక సాక్షి తెలిపారు. ఆ తరువాత కాసేపటి కాల్పులు జరిగాయని అతను చెప్పాడు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ తాజాగా గుర్తించింది. నిందితుడిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు.