మరో కొత్త కంపెనీ ప్రకటించిన మస్క్..

by Mahesh |   ( Updated:2023-07-13 03:49:02.0  )
మరో కొత్త కంపెనీ ప్రకటించిన మస్క్..
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ 'xAI' అనే పేరుతో మరో కొత్త కంపేనిని ప్రకటించారు. "విశ్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం xAI యొక్క లక్ష్యం" అని కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. అలాగే ఈ కంపెనీ.. తమ లక్ష్యం వైపు పురోగతి సాధించడానికి X (Twitter), Tesla, ఇతర కంపెనీలతో కలిసి పని చేస్తామని" స్పష్టం చేసింది. మరి మస్క్ కొత్త కంపెని ఏ మేర ఫలితాలను రాబడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Advertisement

Next Story