Elon Musk: ప్రపంచ దేశాధినేతల ఏఐ ఫ్యాషన్ షో..! మస్క్ ట్వీట్

by Ramesh Goud |
Elon Musk: ప్రపంచ దేశాధినేతల ఏఐ ఫ్యాషన్ షో..! మస్క్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాధినేతలతో పాటు పలు కంపెనీల సీఈవోల ఏఐ ఫ్యాషన్ షోకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.దీనిని టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1 నిమిషం 23 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో పోప్ ప్రిన్స్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నడుచుకుంటూ రాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీల్ చైర్ లో కూర్చొని ఫ్యాషన్ షోలో చేసినట్లు ఉంది. అనంతరం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షులు ట్రంప్, దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్, హిల్లరీ క్లింటన్, కమలా హరీస్, మెలోనీ, భారత ప్రధాని మోడీ సహా పలువురు దేశాధ్యక్షుడు ఫ్యాషన్ దుస్తులలో మెరిసినట్లు చూపించారు. దేశాధ్యక్షులలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులతో పలు మార్లు ర్యాంప్ వాక్ చేసినట్లు సృష్టించారు. వీరితో పాటు యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ర్యాంప్ పై నడిచినట్లు కృత్రిమ మేధ ద్వారా వీడియోను తయారు చేశారు. దీనిని ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వారి ఫోటోలతో కూడిన మీమ్స్ ను కామెంట్ల రూపంలో షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story