పాకిస్థాన్‌లో భూకంపం: 5.5 తీవ్రతగా నమోదు

by samatah |
పాకిస్థాన్‌లో భూకంపం: 5.5 తీవ్రతగా నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ పాకిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినట్టు సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైనట్టు తెలిపింది. పాక్-ఆప్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో 105కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. దీని కారణంగా ఇస్లామాబాద్, లాహోర్, దాని పరిసర ప్రాంతాలు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు. కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలోనూ 4.7 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే ఈ ఏడాది జనవరిలో 4.3తీవ్రతతో ఒకసారి, 6.0తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. అంతకు ముందు 2021అక్టోబర్‌లో బలూచిస్తాన్‌లోని హర్నై ప్రాంతంలో సంభవించిన భూకంపం వల్ల 40 మంది మరణించగా.. మరో 300 మంది గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed