Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ..!

by Maddikunta Saikiran |
Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ దేశంలో మాటిమాటికీ భూకంపాలు సంభవిస్తాయన్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ రోజు సాయంత్రం జపాన్ దేశం దక్షిణ తీరప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం జపాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4:43 గంటలకు సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.1గా నమోదైంది . భూ ప్రకంపనల ధాటికి భారీ బిల్డింగ్లు , వాహనాలు అన్ని ఊగిపోయాయి. దీంతో ప్రజలు అందరు భయంతో బయటకి పరుగులు తీశారు. జపాన్‌లోని ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా జపాన్ దక్షిణ తీరప్రాంతాలైన మియాజాకి, కొచ్చి, ఒయిటా, కగోషిమా ప్రాంతాలకు వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు . తీరప్రాంత నుండి దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed