ఈరోజు, మార్చి 31న‌, భూమిని తాక‌నున్న‌ సౌర తుఫాను!

by Sumithra |
ఈరోజు, మార్చి 31న‌, భూమిని తాక‌నున్న‌ సౌర తుఫాను!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః అంత‌రిక్షంలో ఎప్పుడు ఎలాంటి ప‌రిస్థితి నెల‌కొంటుందో గ్ర‌హించ‌గ‌ల‌మేమో కానీ నిరోధించే శ‌క్తి మ‌న‌కింకా లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు భూమిని సుర‌క్షిత ఆవాసంగా మార్చుకున్న‌ప్పుడే మ‌నిషికి ఇక్క‌డ‌ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుందని మ‌రోసారి గుర్తుచేయ‌డానికి ఓ హెచ్చ‌రిక మ‌ళ్లీ వ‌చ్చింది. ఈరోజు అంటే, గురువారం, 2022 మార్చి 31న ఓ సౌర తుఫాను నేరుగా భూమిని తాకే అవకాశం ఉందని నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ ఏజెన్సీ (నాసా) మూడు రోజుల క్రితం తెలియ‌జేసింది. ఈ సౌర తుఫాను సూర్యుని ఉపరితలం నుండి విద్యుదయస్కాంత విస్ఫోటనాలు జరిగే ఒక సంఘ‌ట‌న‌. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో సూర్య కణాలు అంత‌రిక్షంలో నుండి భూమిపైకి ప్రవహిస్తాయి. దీని కార‌ణంగా బ్రిటన్‌లో భూవాతావరణాన్ని బలమైన సౌర తుఫాను ఢీకొనే ప్రమాదం ఉందని నాసా నివేదించింది.

అయితే, సౌర తుఫాను భూమిని ఢీకొనే సమయంపై నాసా, యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ మధ్య అభిప్రాయ భేదాలు లేక‌పోలేదు. నాసా ప్రకారం, భూమిని ఢీకొనడం మార్చి 28 ఉదయం 6 గంటలకు జరుగుతుందని, మరోవైపు, ఈ సంఘటన 18 గంటల క్రితం జరిగింద‌ని అంచనా వేసిన‌ట్లు అమెరికాకు చెందిన నోఆ సంస్థ పేర్కొంది. అయితే, యూకేలోని ప‌లు ప్రాంతాలలో ఈ తుఫాను ఢీకొనే సమయంలో ప్రకాశవంతమైన మెరుపును చూడొచ్చ‌ని ఆ సంస్థ తెలిపింది. ఈ స‌మ‌యంలో సౌర గాలులు భూమి అయస్కాంత క్షేత్రం లేదా వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, వాతావరణంలో పెద్ద వెలుగు కనిపిస్తుంది. దీనిని సాధారణంగా అరోరా పొలారిస్ అంటారు. అంతేకాకుండా, ఉత్తర అర్ధగోళంలో, దీనిని నార్తర్న్ లైట్ అని అంటున్నారు.

"స్పేస్ వెదర్ ఉమెన్"గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ తమితా స్కోవ్ చెబుతున్న ప్ర‌కారం, ఈ సౌర తుఫాను తాకినప్పుడు భూమికి ఏ వైపునైనా పగటిపూట ఎక్కడైనా స‌రై హై-ఫ్రీక్వెన్సీ రేడియో సమస్యలు త‌లెత్త‌వ‌చ్చ‌ని, రిసెప్షన్ ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. అలాగే, ఈ తాకిడి ప్రభావం మధ్య-అక్షాంశాల వరకు విస్తరించవచ్చని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ సౌర తుఫాను ఆకాశాన్ని తాకుతున్న స‌మ‌యంలో ప్రకాశవంతమైన కాంతిని న్యూయార్క్‌లోని గ్రామీణ ప్రాంతాలలో చూడొచ్చ‌ని ఆమె చెప్పారు. అలాగే దానికి సంబంధించిన‌, అరోరా న్యూజిలాండ్‌, తాస్మానియాలో కనిపిస్తుందని, అక్క‌డ‌ తుఫాను సాయంత్రం వేళ‌ల్లో క‌నిపింస్తుంద‌ని అన్నారు. అప్ప‌టికే కాస్త చీకటి ఉంటుంది క‌నుక‌ ఈ ప్రాంతాల్లో కాంతిని చూసే అవకాశం ఉండొచ్చ‌ని తెలిపారు.

Advertisement

Next Story