మాస్కోలో డ్రోన్ దాడుల కలకలం..

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-30 11:18:38.0  )
మాస్కోలో డ్రోన్ దాడుల కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులు కలకలం రేపాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పౌరులు స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల తర్వాత ఎమర్జె్న్సీ సర్వీసుల్లన్నీ అలర్ట్ చేసినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడికి కారణమైన వారిని గుర్తిస్తున్నట్లు మాస్కో గవర్నర్ ఆండ్రీ తెలిపారు. ఉక్రెయిన్ ఈ దాడులకు కారణమని రష్యా ఆరోపణలు చేసింది. దాడికి యత్నించిన మరికొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు ఆండ్రీ తెలిపారు. అయితే డ్రోన్ల దాడిపై ఉక్రెయిన్ స్పందించింది. దాడుల పట్ల సంతోషిస్తామని కానీ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మే తొలివారంలో మాస్కోలో వ్లాదిమిర్ పుతిన్, కీలక పరిపాలనా యంత్రాంగమంతా కార్యకలాపాలు నిర్వహించే క్రెమ్లిన్ పై రెండు డ్రోన్లు దాడికి పాల్పడ్డాయి. పుతిన్ ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ కుట్ర పన్నిందని ఈ సందర్భంగా రష్యా ఆరోపించింది. రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story