పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో డోనాల్డ్ ట్రంప్ సెక్స్.. అసలేంటీ వివాదం?

by Sathputhe Rajesh |
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో డోనాల్డ్ ట్రంప్ సెక్స్.. అసలేంటీ వివాదం?
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ ఏదో వివాదంతో వార్తల్లో నిలిచే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అనేక అంశాల్లో దూకుడు ప్రదర్శించే ట్రంప్ ఇటీవల తమ మద్దతు దారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. మంగళవారం తనను అరెస్ట్ చేయవచ్చని, సపోర్టర్స్ భారీ నిరసనలు చేయాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేకున్నా మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారని ఆయన తరపు లాయర్ అన్నారు.

అసలు వివాదమేంటీ?

డోనాల్డ్ ట్రంప్ 2006లో తనతో సెక్స్ చేశారని.. పోర్న్ సినిమాల్లో నటించే స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు. ఆ విషయాన్ని బయటపెట్టకూడదంటూ తనను బెదిరించారని ఆమె చెప్పారు. 2016 ఎన్నికల ముందు ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు ట్రంప్ లాయర్ తనకు 1.30లక్షల డాలర్లు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇదే విషయాన్ని ట్రంప్ లీగల్ టీంలోని ఓ న్యాయవాదే డేనియల్స్ ఎలిగేషన్స్ నిజమేనంటూ సంచలన ప్రకటన చేశారు.

ట్రంప్ మాజీ లాయర్ మైఖేల్ కోహెల్, డేనియల్స్ కు 1,30,000 డాలర్లు ముట్టజెప్పారని, తరువాత ఆ సొమ్మును కొహెన్‌కు అందజేశారన్న విషయాన్ని న్యాయవాది రూడీ గియూలియానీ స్పష్టం చేశారు. కాగా రికార్డుల్లో మాత్రం ఈ మొత్తం లీగల్ ఫీజు కింద చెల్లించినట్లు ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తప్పుడు రికార్డులు సృష్టించారని కోర్టు తీర్పు చెప్పవచ్చని పలువురు భావిస్తున్నారు. ట్రంప్ మాత్రం ఈ చెల్లింపుల గురించి తనకేమి తెలియదని చెబుతూ వస్తున్నారు.

ఈ కేసుకు సంబంధించి ఐదేళ్లుగా ట్రంప్‌పై విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రంప్ 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. నేరం రుజువైనా సరే ప్రచారాలు కొనసాగిస్తానని ఆయన చెబుతున్నారు. శనివారం ట్రంప్ తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ‘ట్రూత్ సోషల్‌‌’లో తన అరెస్ట్ గురించి రాసుకొచ్చారు. తనకు మాన్ హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం నుంచి రహస్య సమాచారం వచ్చిందని తన అరెస్ట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ అరెస్ట్ అవుతారా.. అయితే ఆయన మద్ధతు దారులు ఎలా రియాక్ట్ అవుతారనే టెన్షన్ ప్రస్తుతం అమెరికాలో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed