క్వీన్ ఎలిజబెత్, డయానా ‘కిస్‌డ్ మై యాస్’.. ట్రంప్ హాట్ కామెంట్స్

by Harish |   ( Updated:2023-03-15 16:49:55.0  )
క్వీన్ ఎలిజబెత్, డయానా ‘కిస్‌డ్ మై యాస్’.. ట్రంప్ హాట్ కామెంట్స్
X

న్యూఢిల్లీ: యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ‘లెటర్స్ టు ట్రంప్’ పుస్తక ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. క్వీన్ ఎలిజబెత్, డయానా ‘కిస్డ్ మై యాస్’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రభావవంతులైన క్వీన్ ఎలిజబెత్, ప్రిన్సెస్ డయానా, ఒప్రా విన్‌ఫ్రే, మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా ఇదే చేశారని వెల్లడించారు. ‘వాళ్లంతా చాలా మనోహరమైన జీవితాన్ని చూడబోతున్నారని అనుకుంటున్నాను. వాళ్లంతా నాకు తెలుసు. వారిలో ప్రతి ఒక్కరు నా యాస్‌ను కిస్ చేశారు. ఇప్పుడు వారిలో సగం మంది మాత్రమే నా యాస్‌ను ముద్దాడుతున్నారు’ అని ట్రంప్ ది గార్డియన్ పత్రికతో అన్నారు.

ఇదిలావుంటే.. రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తన తండ్రి పట్ల ఈ ప్రముఖులంతా భిన్నంగా ప్రవర్తించారని ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్ ట్రంప్ జూనియర్ అన్నారు. ‘నా తండ్రి అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఆయన చూట్టూనే ఉండేవారు. అయితే నా తండ్రి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత వాళ్లల్లో మార్పును చూసి ఆశ్చర్యపోయాను’ అని ట్రంప్ జూనియర్ అన్నారు.

Advertisement

Next Story