Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమస్యే కాదు.. అదే అసలు ప్రాబ్లం : డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-21 09:30:28.0  )
Donald Trump: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమస్యే కాదు.. అదే అసలు ప్రాబ్లం : డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమస్యే కాదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అమెరికాలోని విస్కాన్సిన్‌లో మాట్లాడుతూ.. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను సహించబోనని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను ఆపుతాననే నమ్మకం ఉందని, ప్రస్తుతం అది సమస్యే కాదని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌లాగా ఇస్లామిక్ ఉగ్రవాదం వ్యాపించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ISIS‌ను సమూలంగా చేశానని ట్రంప్ గుర్తు చేశారు.

Advertisement

Next Story