- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: నేను అధ్యక్షుడిగా గెలవాలని కిమ్ కోరుకుంటున్నారు..డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కోరుకుంటున్నట్టు తెలిపారు. మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. నన్ను మిస్ అవుతున్నట్టు కిమ్ భావిస్తున్నాడని.. అందుకే మరోసారి నన్ను ప్రెసిడెంట్‌గా చూడాలని కిమ్ జోంగ్ ఉన్ కోరుకుంటున్నారన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను ఆపివేసినట్టు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం మరోసారి ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తున్నట్టు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే యుద్ధాలను ఆపుతానని ట్రంప్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కిమ్‌ను తరచూ ‘లిటిల్ రాకెట్ మ్యాన్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇరువురి మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ తర్వాత దౌత్య విధానాన్ని అనుసరించి చర్చలు జరిపారు. మొత్తం ట్రంప్ తన పదవీ కాలంలో కిమ్‌తో మూడు సార్లు భేటీ అయ్యారు.