అంత టైమ్‌ నీటిలో న‌డిచి వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించాడు! ఇదే కార‌ణం..?!

by Sumithra |   ( Updated:2023-12-16 17:07:53.0  )
అంత టైమ్‌ నీటిలో న‌డిచి వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించాడు! ఇదే కార‌ణం..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః కొంద‌రికి నీళ్లంటేనే చాలా భ‌యం. ఇంకొంద‌రికి నీళ్ల‌ల్లో దిగాలంటే, మ‌రికొంద‌రికి నీటిలో మున‌గాలంటే చచ్చేంత ద‌డ‌. మ‌రి ఈ వ్య‌క్తి మాత్రం నీళ్ల‌ల్లో ఎక్కువ సేపు న‌డిచి రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు. క్రొయేషియాకు చెందిన‌ ఫ్రీడైవర్ ఒకే ఒక్క‌సారి శ్వాస తీసుకొని నీటి లోప‌ల‌ ఎక్కువసేపు నడిచి, గిన్నిస్ వ‌ర‌ల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఇటీవ‌ల ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWS) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. వృత్తిప‌రంగా ఫ్రీడైవర్ అయిన‌ విటోమిర్ మారిసిక్, 3 నిమిషాల 6 సెకన్ల స‌మ‌యం చేతిలో ఒక‌ బార్‌బెల్ ప్లేట్‌ను పట్టుకుని యాభై మీటర్ల స్విమ్మింగ్ పూల్ (107 మీటర్లు)లో ఈ ఫీట్‌ను సాధించాడు. దీనికి ముందు రికార్డును గ‌మ‌నిస్తే, 2020 మార్చిలో క్రొయేషియా దేశానికే చెందిన‌ ఫ్రీడైవర్ బోరిస్ మిలోసిక్ 96 మీటర్లు నడిచాడు. ఇక‌, తాజా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, మారిసిక్ ఈ ఫీట్ సాధించ‌డానికి ఎలాంటి శిక్షణ కూడా పొంద‌క‌పోవ‌డం విశేషం. అయితే, ఈ ఫీట్ చేయ‌డానికి మారిసిక్ ఓ సామాజిక కార‌ణాన్ని కూడా వేదిక‌గా చేసుకున్నాడు. గుండె, ఊపిరితిత్తులు, రుమాటిక్ వ్యాధుల పునరావాసం కోసం క్రొయేషియాలోని తల్లాసోథెరపియా ఒపాటిజా ఆసుప‌త్రి స్విమ్మింగ్ పూల్‌ను ఎంచుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed