కూలిన రష్యా సైనిక విమానం: 65 మంది మృతి!

by samatah |
కూలిన రష్యా సైనిక విమానం: 65 మంది మృతి!
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యాకు చెందిన ఇల్యుషిన్-76 అనే సైనిక విమానం బుధవారం కుప్పకూలినట్టు సమాచారం. ఈ ఘటనలో విమానంలో ఉన్న 65 మంది మరణంచినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గొ రోడ్ సమీపంలో విమానం కుప్పకూలినట్టు వెల్లడించింది. విమానంలో ఉక్రెయిన్ సాయుధ దళాలకు చెందిన సభ్యులు ఉన్నట్టు పేర్కొంది. అయితే కూలిపోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. బెల్గోరోడ్ ప్రాంతీయ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్‌కోవ్ ఘటనను ధ్రువీకరించారు. కాగా, ఇల్యుషిన్-76 అనేది సైనిక రవాణా విమానం. ఇది సైనిక పరికరాలు, ఆయుధాలను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి రూపొందించారు. ఇది ఐదుగురు సిబ్బందిని కలిగి ఉండగా..90 మంది ప్రయానించే వీలుంటుంది.

Advertisement

Next Story