China: సరిహద్దు నుంచి వెనుదిరిగిన చైనా దళాలు.. నిర్ధారించిన అధికారులు

by Javid Pasha |   ( Updated:2022-09-09 07:47:05.0  )
China: సరిహద్దు నుంచి వెనుదిరిగిన చైనా దళాలు.. నిర్ధారించిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం ఇంకా ముగియలేదు. భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దళాలు భారీగా మొహరించి ఉన్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా తూర్పు లదాక్‌‌లోని గోగ్రా-హాట్‌స్ట్రింగ్ ప్రాంతాల నుంచి చైనా, భారత దళాలను తొలగించనున్నట్లు చైనా మిలటరీ శుక్రవారం అధికారంగా వెల్లడించింది. అంతేకాకుండా దళాల తొలగింపును ఇరు దేశాలు సమన్వయంతో తీసుకున్న నిర్ణయమని తెలిపింది. అయితే గత రెండేళ్లుగా లదాక్ ప్రాంతంలో నడుస్తున్న భారత, చైనా దళాల స్టాండ్ ఆఫ్ ఘటనలో భారీ ముందడగులా చెప్పుకొచ్చని చైనా రక్షణ శాఖ మంత్రి తెలిపింది.

'చైనా, ఇండియా కమాండర్ స్థాయి సమావేశాలు 16 విడతకు చేరుకున్నాయి. ఇందులో ఇరు దేశాల అధికారుల ఏకాభిప్రాయానికి వచ్చాయి. జియానాన్, దబాన్ ప్రాంతంలోని ఇరు దేశాల ఆర్మీ ట్రూప్‌లను తొలగించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతకు అనుకూల పరిస్థితులను ఏర్పరుస్తాయి' అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారంగా తెలిపింది.

Advertisement

Next Story