మళ్లీ అణు పరీక్షలకు చైనా రెడీ!

by Vinod kumar |
మళ్లీ అణు పరీక్షలకు చైనా రెడీ!
X

బీజింగ్ : చైనా మరోసారి అణు పరీక్షలకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలతో ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. షింజియాన్ అటానమస్ రీజియన్‌లోని లోప్ నుర్ అణు పరీక్షల కేంద్రాన్ని చైనా తిరిగి యాక్టివేట్ చేసిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. త్వరలోనే అక్కడ న్యూక్లియర్ టెస్టులను నిర్వహిస్తారని ప్రస్తావించారు. కొత్త తరహా బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులకు అమర్చేందుకు డిజైన్ చేసిన అత్యాధునిక న్యూక్లియర్ వార్‌హెడ్‌ల సామర్థ్యాన్ని ఈసారి చైనా టెస్ట్ చేయబోతోందని అంటున్నారు.

చైనా తొలిసారిగా 1964 సెప్టెంబరు 16న లోప్ నుర్ అణు పరీక్షల కేంద్రంలోనే న్యూక్లియర్ టెస్టులు చేసింది. అణ్వాయుధాల సంఖ్యను మరింత పెంచుకునేందుకే డ్రాగన్ ఈ కసరత్తు చేస్తోందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ ఇంటెలిజన్స్ నిపుణుడు డాక్టర్ రెన్నీ బాబియార్జ్ అందించిన సమాచారం ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ విశ్లేషణ చేసింది. పదేళ్ల క్రితం దాకా చైనా వద్ద దాదాపు 50 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికి చేరుకుంది. వీటిలో సగానికిపైగా అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థం కలిగినవే కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed