Bangladesh citizens: మేఘాలయాలో10 మంది బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్.. కారణమిదే?

by vinod kumar |
Bangladesh citizens: మేఘాలయాలో10 మంది బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది బంగ్లాదేశ్ పౌరులను మేఘాలయ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అందించిన సమాచారం మేరకు బీఎస్ఎఫ్ దళాలు, పోలీసులు పురఖాసియా దలు, అంపాటి మధ్య చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అయితే బంగ్లాదేశ్ పౌరులు ఈ ప్రాంతాన్ని దాటిపోయారని తెలియడంతో వారు జిగ్ జాగ్ పోలిస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పురఖాసియా వైపు వస్తున్న బంగ్లాదేశ్ వాసులను సౌత్ వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నంచి నకిలీ ఆధార్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చారు. కేసు నమోదు చేసిన తదుపరి విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు. భారత లోకి అక్రమంగా ప్రవేశించడానికి గల కారణాలు, నకిలీ పత్రాల వినియోగంపై దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా, గతంలోనూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ఐదుగురిని అగర్తల రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed