Canada study visa: కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..సగానికి తగ్గనున్న స్టడీ వీసాలు..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-09-10 23:31:20.0  )
Canada study visa: కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్..సగానికి తగ్గనున్న స్టడీ వీసాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడాలో(Canada) చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల(Indian students)కు జస్టిన్ ట్రూడో(Justin Trudeau) ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది.ఇప్పటికే విదేశీ విద్యార్థులకు వారానికి 40 గంటలు ఉన్న వర్క్ పర్మిట్ ను 20 గంటలకు తగ్గించిన అక్కడి ప్రభుత్వం తాజాగా భారతీయ విద్యార్థుల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ విషయాన్ని కెనడా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీ అప్లైబోర్డ్‌(ApplyBoard) తాజాగా నివేదించింది. దీంతో ఆ దేశంలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు మరింత కష్టాలు పెరిగాయి.ఈ విషయం భారత దేశ విద్యార్థులకు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది భారతీయులే. అందులోనూ ఎక్కువ భాగం తెలుగు రాష్ట్రాల విద్యార్థులే ఉంటారు.కెనడాలో పెరుగుతున్న ఇళ్ల కొరతతో పాటు, నిరుద్యోగ సమస్యను నివారించడం కోసమే కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా అప్లైబోర్డ్‌ నివేదిక ప్రకారం,ట్రూడో ప్రభుత్వం గత ఏడాది 4,36,000 స్టడీ వీసాలు జారీచేయగా, ఈ ఏడాది వీటి సంఖ్య కేవలం 2,31,000కు పరిమితయ్యే అవకాశముంది.కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో కెనడా ప్రభుత్వం సగం వరకు స్టడీ వీసాలు తగ్గించగా రాను రాను స్టడీ వీసా పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గించే అవకాశముంది.ట్రూడో ప్రభుత్వం 50 శాతం వరకు స్టడీ వీసాలు తగ్గిస్తే కేవలం కొంత మంది భారతీయ విద్యార్థులకు మాత్రమే పర్మిట్లు దొరుకుతాయి.ప్రస్తుతం కెనడాలో దాదాపు మూడున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లేదిగా ఉందనడంలో సందేహం లేదు.

Advertisement

Next Story

Most Viewed