California Senator: ఆమె నన్ను లైంగికంగా వాడుకుంది..కాలిఫోర్నియా సెనెటర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన ఉద్యోగి

by Maddikunta Saikiran |
California Senator: ఆమె నన్ను లైంగికంగా వాడుకుంది..కాలిఫోర్నియా సెనెటర్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన ఉద్యోగి
X

దిశ, వెబ్‌డెస్క్:అమెరికా(America)లోని కాలిఫోర్నియా(California) రాష్ట్ర రిపబ్లికన్ (Republican) సెనెటర్(Senator) 50 ఏళ్ల మేరీ అల్వరాడో గిల్(Marie Alvarado-Gil) వివాదంలో చిక్కుకున్నారు. గిల్ తనను సెక్స్ బానిస(sex slave)గా వాడుకుందని ఆమె వద్ద పని చేసిన ఉద్యోగి,సెనెట్‌ మాజీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌, చాడ్ కాండిట్(Chad Condit) ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. విధుల్లో ఉన్నప్పుడు ఆమె తనను లైంగిక బానిసగా వాడుకున్నారని అతను ఆరోపించారు.తనకు న్యాయం కావాలని కోరుతూ గత వారం శాక్రామెంటో కౌంటీ సుపీరియర్(Sacramento County Superior) కోర్టులో దావా వేశారు.

వివరాల్లోకి వెళ్తే..చాడ్ కాండిట్ మాజీ కాలిఫోర్నియా కాంగ్రెస్‌మెన్ కుమారుడు.2022 లో కాలిఫోర్నియా సెనెటర్ గా గిల్ ఎన్నికైన తర్వాత కాండిట్ ను తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించుకుంది. విధుల్లో చేరిన కొన్ని రోజుల నుంచే ఆమె తనతో వ్యక్తిగత విషయాలను పంచుకునేవారని అలాగే తన లైంగిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడేవారని బాధితుడు తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.కొన్ని సమయాల్లో ఆమె అసహజ శృంగారం కోసం డిమాండ్ చేసేవారని , కాదంటే బెదిరించే వారని వెల్లడించారు.అసహజ శృంగారం వల్ల తనకు అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం ఈ విషయాన్ని ఇన్ని రోజులు బయటపెట్టలేదని బాధితుడు వాపోయారు.అయితే శాంటాక్లాజ్ కాస్ట్యూమ్స్ వేసుకోలేదన్న కారణంగా గత ఏడాది డిసెంబరులో తనను విధుల నుంచి తప్పించారని బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించారు.తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని కోరుతూ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టులో ఆయన దావా వేశారు.

అయితే..ఈ ఆరోపణలను సెనేటర్ కొట్టిపారేశారు. తన నుంచి డబ్బులు లాగేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండి పడ్డారు.తాను ఎవర్నీ లైంగికంగా వేధించలేదన్నారు. ఇదిలా ఉంటే ఈ సెనెటర్‌ కొన్ని నెలల క్రితమే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా యూఎస్‌ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం.కాగా మేరీ అల్వరాడో గిల్‌కు ఇదివరకే వివాహమై ఆరుగురు సంతానం ఉన్నారు. తనకు కూడా వివాహమైనట్లు బాధిత వ్యక్తి దావాలో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై కోర్టు విచారణ జరపనుంది.

Advertisement

Next Story