- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంపై బ్రిటన్ ప్రధాని రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ భారత సంతతికి చెందిన వ్యక్తి అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఆయన ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, ప్రముఖ సామాజిక సేవకురాలు సుధా మూర్తి దంపతుల గారాల పట్టి అక్షతా మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. కాగా తాజాగా సుధామూర్తిని భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా అక్షతా మూర్తి స్పందిస్తూ ‘‘ సామాజిక సేవా విభాగంలోమా అమ్మకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
ఈ సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ ప్రతిష్టాత్మక అవార్డును మా అమ్మ స్వీకరించగా ఆ దృశ్యాలను దగ్గరుండి చూడటం చాలా గర్వంగా అనిపించింది’’ అని తన ఇన్ స్టా గ్రామ్ లో కామెంట్ చేసింది. ‘‘ఏదో గుర్తింపును ఆశించి మా అమ్మ సమాజ సేవ చేయడంలేదు. హార్డ్ వర్క్, నిస్వార్ధం, దయ వంటి గుణాలు నాకు నా సోదరుడికి మా తల్లిదండ్రుల నుంచే వచ్చాయి. నిన్నటి అవార్డు కార్యక్రమాన్ని వీక్షించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని కామెంట్ చేశారు. కాగా ఆమె పోస్టుకు బదులిస్తూ ‘‘ గర్వపడే రోజు’’ అంటూ చప్పట్లు కొడుతున్న రెండు ఎమోజీలను బ్రిటన్ ప్రధాని రుషి సునక్ షేర్ చేశారు.