Breaking : Apple కొత్త CFOగా భారత సంతతి వ్యక్తి కేవన్ పరేఖ్ నియామకం

by Maddikunta Saikiran |
Breaking : Apple కొత్త CFOగా భారత సంతతి వ్యక్తి  కేవన్ పరేఖ్ నియామకం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సంస్థ Apple తన తదుపరి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌(CFO)ను ప్రకటించింది. భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ నియమితులవుతున్నట్లు పేర్కొంది. జనవరి 2025 నుండి కేవన్ పరేఖ్‌ తన బాధ్యతలు చేపడుతాడని తెలిపింది. ఇతను 11 సంవత్సరాల నుండి Apple సంస్థలో పని చేస్తున్నారు. పరేఖ్ ప్రస్తుతం Apple యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. Apple CEO టిమ్ కుక్ మాట్లాడూతూ.. పరేఖ్‌కు కంపెనీ పట్ల ఉన్న లోతైన అవగాహన ఉందని తదుపరి CFOగా ఎంపిక కావడానికి పరేఖ్ యొక్క పదునైన తెలివితేటలు, ఆర్థిక నైపుణ్యం ప్రధాన కారణాలని కుక్ వెల్లడించారు.

పరేఖ్ జూన్ 2013లో Apple కంపెనీలో చేరారు. అతను మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, చికాగో విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పొందారు. Appleలో చేరడానికి ముందు థామ్సన్ రాయిటర్స్& జనరల్ మోటార్స్‌లో పనిచేశాడు. ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ ట్రెజరర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ అలాగే రీజినల్ ట్రెజరర్‌తో సహా వివిధ సీనియర్ హోదాల్లో పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed