- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Boston baby surgery | గర్భంలో ఉన్న శిశువుకి చికిత్స.. అరుదైన సర్జరీ చేసిన అమెరికన్ వైద్యులు
దిశ, వెబ్ డెస్క్ : అమెరికన్ వైద్యులు ఓ అరుదైన సర్జరీ చేశారు. తల్లి గర్భంలోని శిశువు మెదడుకు విజయవంతంగా చికిత్స చేశారు. ప్రపంచంలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సంఘటన అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగింది.
అమెరికాలోని బోస్టన్ చిన్న పిల్ల ఆస్పత్రి వైద్యులు సరికొత్త శస్త్ర చికిత్సకు నాంది పలికారు. శిశువు గర్భంలో ఉండగానే మెదడులో సంభవించే ఓ వైకల్యానికి శస్త్ర చికిత్స చేసేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నారు. గర్భంలోనే శిశువు మెదడుకు శస్త్ర చికిత్స చేశారు. గర్భస్థ శిశువుల్లో అరుదుగా వచ్చే 'వీన్ ఆఫ్ గాలెన్' అనే వైకల్యాన్ని గుర్తించి శిశువు మెదడుకు శస్త్ర చికిత్స చేసి తల్లీబిడ్డలను రక్షించారు. బోస్టన్ చిల్ట్రన్ హాస్పిటల్, బ్రిఘం మహిళల ఆస్పత్రి ఆధ్వర్యంలో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
శిశువు గర్భంలో ఉన్నప్పుడు మహిళలకు అప్పుడప్పుడూ రొటీన్ చెకప్ కోసం అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. అలా ఒక మహిళకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయగా.. 'వీన్ ఆఫ్ గాలెన్' అనే వైకల్యం ఉందని వైద్యులు గుర్తించారు. ఆ సమస్య వల్ల మెదడు నుంచి గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఈ సమస్య అలాగే ఉండి ఉంటే...నరాలపై ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. చిన్నారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే చికిత్స అందించినట్టు వెల్లడించారు. పుట్టిన వెంటనే గుండె ఆగిపోవడమో, లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడమో లాంటివి ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పారు.
జరగదని లేదని గుర్తించి సర్జరీ చేశారు. ఈ సమస్య అలాగే ఉండి ఉంటే...నరాలపై ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని వైద్యులు చెప్పారు. చిన్నారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వెంటనే చికిత్స అందించినట్టు వెల్లడించారు. పుట్టిన వెంటనే గుండె ఆగిపోవడమో, లేదంటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడమో లాంటివి ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్పారు.
బోస్టన్ చిన్న పిల్లల ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. "ఈ సర్జరీ చేయడం మాకు ఓ సవాల్‌గా అనిపించింది. పుట్టిన తరవాత ఆ చిన్నారికి చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా సర్జరీ చేశాం. కాకపోతే చాలా సమయం పట్టింది. అడ్వాన్స్‌డ్ పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల మా పని కాస్త సులువైంది. ఇలాంటి సమస్యతో బాధ పడే చిన్నారుల్లో 50-60% మంది మాత్రమే సేఫ్‌గా ఉంటారు. మిగతా 40% మంది పురిట్లోనే చనిపోతారు. అందుకే జాగ్రత్త పడి చికిత్స చేశాం. అల్ట్రాసౌండ్ తీసినప్పుడు మాకు ఈ సమస్య ఉందని తెలిసింది. అప్పటికే ప్రెగ్నెన్సీ వచ్చి 34 వారాలు దాటింది. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశాం," అని అన్నారు.
ఇరాక్‌లో అవిభక్త కవలలపై మరో అరుదైన సర్జరీ..
ఇరాక్‌కు చెందిన ఇద్దరు అవిభక్త కవలలకు అరుదైన సర్జరీ చేసి వేరు చేశారు వైద్యులు. దాదాపు 11 గంటల పాటు 27 మంది వైద్యులు శ్రమించి ఈ సర్జరీని విజయవంతం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. స్పెషలిస్ట్‌లు, నర్సులు, టెక్నికల్ స్టాఫ్..ఇలా అంత మంది కష్టపడితే కానీ ఆ సర్జరీ పూర్తి కాలేదు. ఈ ఇద్దరు చిన్నారుల కాలేయం, పొత్తి కడుపు అతుక్కునిపోయాయి. చాలా సున్నితమైన సర్జరీని...కింగ్ సాల్మన్ ఆదేశాలతో పూర్తి చేశారు వైద్యులు. సౌదీ అరేబియా దేశంలో జరిగే సౌదీ కన్జాంట్ ట్విన్స్ ప్రొగ్రాంలో భాగంగా సౌదీ అరేబియాలో ఇలాంటి సర్జరీలు చేస్తుంటారు. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 127 మంది అవిభక్త కవలల్ని విడదీశారు.
32 ఏళ్లుగా అక్కడి వైద్యులు ఈ సేవలందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇద్దరు చిన్నారులూ ఆరోగ్యంగా ఉన్నారు. కింగ్ అబ్దుల్లా స్పెషలైజ్డ్ ఆసుపత్రిలో దాదాపు ఆరు దశలుగా ఈ సర్జరీ చేశారు. అయితే ఈ సర్జరీని నేతృత్వం వహించిన వైద్యుడు కీలక విషయం వెల్లడించారు. ఆపరేషన్ 70% మాత్రమే సక్సెస్ అయిందని చెప్పారు. చాలా వరకు అవయవాలు అతుక్కుపోయాయని అన్నారు. ఈ సర్జరీని పూర్తి చేసిన వైద్యులకు థాంక్స్ చెప్పారు. హెల్త్ సెక్టార్‌లో అభివృద్ధి సాధిస్తున్నామనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈ కవలలను సౌదీకి తీసుకొచ్చారు.