Big News: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హారిస్.. డెమొక్రాటిక్ పార్టీ సంచలన ప్రకటన

by Shiva |   ( Updated:2024-08-06 04:39:28.0  )
Big News: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హారిస్.. డెమొక్రాటిక్ పార్టీ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు తలపడతరానే విషయంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఊహాగానాలకు తెర దించుతూ.. డెమొక్రాటిక్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఉన్న కమలా హారిస్‌ను రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటక్ పార్టీ తరఫున బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.

కాగా, దేశ వ్యాప్తంగా నవంబర్‌ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు విజయావకాశాలు కాస్త పెరిగాయి. అదేవిధంగా ఎన్నికల్లో ఖర్చుల కోసం కమలాకు పెద్ద ఎత్తున డొనేషన్స్ రావడం ట్రంప్ క్యాంపులో ఆందోళన రెకెత్తిస్తోంది. అదే విధంగా ఆమె అటెండ్ అయిన మీటింగ్స్‌కు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తుండటంతో కమలా గెలుస్తోందా అన్న సందేహంలో అందరిలోనూ మెదలుతోంది.

Advertisement

Next Story