- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US election: ఒకే వేదికను పంచుకున్న బైడెన్-కమలా హారిస్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన తర్వాత మొదటి సారిగా జో బైడెన్-కమలా హారిస్ గురువారం ఒకే వేదికను పంచుకున్నారు. వాషింగ్టన్ బయట మేరీల్యాండ్ శివార్లలోని కమ్యూనిటీ కళాశాలలో వీరిద్దరు కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ‘థాంక్యూ జో’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఇదే సమావేశంలో బైడెన్ కమలా హారిస్‌ను పొగుడుతూ అధ్యక్ష హోదాలో ఆమె అద్భుతంగా పని చేయగలరని అన్నారు. అలాగే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని బైడెన్ పిలుపునిచ్చారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో హెల్త్ పాలసీ గురించి ఒక ప్రకటన చేశారు. పదవీ విరమణ చేసిన వారికి వైద్య ఖర్చులను తగ్గించేలా గుండె జబ్బులు, రక్తం గడ్డకట్టడం వంటి 10 ఓషధాల ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మరోవైపు అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ మాట్లాడుతూ, మా అధ్యక్షుడికి ప్రేమించే వారు ఇక్కడ చాలా మంది ఉన్నారని అన్నారు. ఇదిలా ఉంటే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ సైతం తన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆయన న్యూజెర్సీలో మాట్లాడుతూ, కమలా హారిస్‌పై విరుచుకుపడ్డారు. నాకు ఆమె పట్ల అంత గౌరవం లేదు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది, ఆమె తెలివిపై నమ్మకం లేదని తీవ్ర స్థాయిలో హారిస్‌పై విమర్శలు చేశారు.