- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైనాను వణికిస్తున్న బెబింగా తుఫాను.. 70 ఏళ్ల తర్వాత రికార్డ్ బద్దలు
దిశ, వెబ్‌డెస్క్: బెబింకా తుఫాను(Typhoon Bebinca) దెబ్బకి చైనా(China) వణికిపోతోంది. గంటకు 151 కి.మీ. వేగంతో ముందుకు కదులుతున్న ఈ తుఫాను ఈ రోజు (సోమవారం) ఉదయం డ్రాగన్ కంట్రీ ఫైనాన్షియల్ స్టేట్ షాంఘైలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే మొత్తం నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను తీవ్రతను అంచనా వేసిన వాతావరణ శాస్త్రవేత్తలు గత 70 ఏళ్లలో షాంఘై (Shanghai) నగరాన్ని తాకిన అత్యంత భయంకరమైన తుఫాన్ ఇదేనని చెబుతున్నారు. సాధారణంగా షాంఘైలోకి తుఫానులు ప్రవేశించడం చాలా అరుదని, ఎప్పుడో 1949లో వచ్చిన గ్లోరియా తుఫాన్ (Gloria Typhoon) తర్వాత ఇదే ఈ నగరంలోకి ప్రవేశించిన అతిపెద్ద తుఫాన్ అనేది నిపుణుల మాట.
కాగా.. తుఫాన్ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంనే స్థానిక విమానాశ్రయాల్లో (Airports) రాకపోకలు నిలిపివేయడంతో పాటు రైళ్లు ప్రయాణాలను కూడా క్యాన్సిల్ చేశారు. దీంతో వందల విమానాలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే.. చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌ని ఈ మధ్యనే యాగి తుఫాను ఇబ్బందిపెట్టింది.
- Tags
- Shanghai