సోషల్ మీడియాపై నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు.. త్వరలో చట్టం

by Mahesh |
సోషల్ మీడియాపై నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు.. త్వరలో చట్టం
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉంది. ఇది ప్రస్తుతం అన్ని దేశాల్లో ఇదే ప్రధాన సమస్యగా మారిపోయింది. దీంతో పిల్లలను ఎలాగైన ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని అనేక దేశాలు ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తమ దేశంలో పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియన్ PM అల్బనీస్ పిల్లల కోసం సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఈ ఏడాది చట్టాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. సోషల్ మీడియా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు PM అల్బనీస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా.. ఫుట్ ఫీల్డ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్ కోర్ట్‌లలో చూడాలనుకుంటున్నాను. సోషల్ మీడియా సామాజిక హాని కలిగిస్తుందని మాకు తెలుసు కాబట్టి వారికి నిజమైన వ్యక్తులతో నిజమైన అనుభవాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము, ”అని పీఎం అల్బనీస్ మీడియాతో చెప్పుకొచ్చారు. కాగా ఈ నిషేధానికి సంబంధించిన విదివిధానాలను ఆయన ప్రకటించినప్పటికీ.. ప్రత్యేక టీమ్ దీనిపై వర్క్ చేస్తుందని త్వరలోనే అన్ని విధివిధానాలతో పాటు ఈ నిర్ణయంతో తలెత్తే సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed