- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్ యుద్ధనౌకలపై దాడి: మరోసారి హౌతీల దుశ్చర్య
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ మద్దతు గల హౌతీలు ఎర్రసముద్రంలో మరోసారి దాడులకు పాల్పడ్డారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. యుద్ధ నౌకలే లక్ష్యంగా ఈ అటాక్ చేసినట్టు యూఎస్ సైనిక ప్రతినిధి యహ్యా సరియా తెలిపారు. ఈ దాడికి ఒక యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణి కూడా ఉపయోగించినట్టు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అయితే హౌతీలు లక్ష్యంగా చేసుకున్న కంటైనర్ షిప్‌లో అగ్నిప్రమాదం సంభవిచండంతో ఆ చిత్రాలకు భారత నౌకాదళం విడుదల చేసింది. దీంతో యూఎస్ దళాలు హౌతీలు ప్రయోగించిన క్షిపణులను ద్వంసం చేశాయి. ఈ ఘటనల్లో ఏమైన ప్రాణ నష్టం జరిగిందా అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గాజాకు మద్దతుగా హౌతీలు వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
వాణిజ్య సరఫరాకు అంతరాయం
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీల దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం దెబ్బతిన్నది. కంపెనీలు తమ సరుకును దక్షిణాఫ్రికా చుట్టు నుంచి తీసుకెళ్లడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఇజ్రాయెల్-హమాస్ వివాదం అంతర్జాతీయ పరిస్థితులను అస్థిరపరచగలదనే ఆందోళనలు మొదలయ్యాయి. గతేడాది నవంబర్ నుంచి హౌతీ మిలిటెంట్లు అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చొరబాట్లకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా వారు ఈ అటాక్స్‌కు పాల్పడుతున్నారు. మరోవైపు హౌతీల దాడుల నుంచి అనేక నౌకలను భారత నావికాదళం రక్షించింది.