అరెస్ట్ వారెంటా.. క్షిపణులతో లేపేస్తాం: ఐసీసీకి మెద్వదేవ్ స్ట్రాంగ్ వార్నింగ్

by Shiva |
అరెస్ట్ వారెంటా.. క్షిపణులతో లేపేస్తాం: ఐసీసీకి మెద్వదేవ్ స్ట్రాంగ్ వార్నింగ్
X

మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్‌కు అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం వారంట్లు జారీ చేయడంపై ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డిమిట్రీ మెద్వదేవ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం భవనంపై క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించారు. ఆకాశంలోకి చూస్తూ ఉండాలంటూ సెటైర్ కూడా వేశారు.

ఉత్తర సముద్రంలోని రష్యా యుద్ధనౌక నుంచి హేగ్‌లోని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం భవనంపైకి హైపర్‌ సోనిక్ క్షిపణి దాడి ఊహించడం సాధ్యమేనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు చట్ట విరుద్ధంగా ఉక్రెయిన్ పిల్లలను రష్యాకు తీసుకెళ్లారంటూ అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానం వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రష్యన్ బాలల హక్కుల కమిషన్ ప్రెసిడెన్షియల్ కమిషనర్‌, ల్వోవా-బిలోవాకు కూడా ఈ ఆరోపణలపై వారంట్‌ను జారీ చేశారు.

Advertisement

Next Story