ఇమ్రాన్ ఖాన్‌కు మరో బిగ్ షాక్.. పాకిస్థాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..!

by Satheesh |
ఇమ్రాన్ ఖాన్‌కు మరో బిగ్ షాక్.. పాకిస్థాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోన్న పాకిస్థాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ)పై నిషేదం విధించాలని నిర్ణయించింది. జాతి వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ సర్కార్ ఈ డెసిషన్ తీసుకుంది. కాగా, ఈ ఏడాది జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ సత్తా చాటిన విషయం తెలిసిందే. అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించి పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ పీటీఐకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు గెలవలేకపోవడంతో.. ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి షెహబాజ్ షరీప్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక, అనేక కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. పీటీఐ నిషేదం విధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇమ్రాన్ మద్దతుదారులు భగ్గుమంటున్నారు.

Advertisement

Next Story