- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్ షిఫా ఆస్పత్రిపై మరోసారి ఆపరేషన్: వెల్లడించిన ఇజ్రాయెల్
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రిపై ఆపరేషన్ ప్రారంభించినట్టు ఇజ్రాయెల్ సైన్యం సోమవారం ప్రకటించింది. ఈ ఆస్పత్రిని హమాస్‌కు చెందిన సీనియర్ ఉగ్రవాదులు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు ప్రస్తుతం ఆస్పత్రి ప్రాంగణంలో మోహరించినట్టు వెల్లడించింది. హమాస్ టెర్రరిస్టులు ఆస్పత్రిలో తలదాచుకున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఆస్పత్రి చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం ట్యాంకులను మోహరించిందని స్థానిక కథనాలు వెల్లడించాయి. ఆల్ షిఫా ఆస్పత్రి గాజాలోనే అతిపెద్ద హాస్పిటల్.. ఇజ్రాయెల్ సైన్యం గతేడాది నవంబర్‌లో అక్కడ ఓ ఆపరేషన్ నిర్వహించగా అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తాయి. దీంతో తాజాగా మరోసారి సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవడంతో ఆందోళనలు పెరిగాయి. కాగా, ఆస్పత్రుల నుంచి హమాస్ సైనిక కార్యకలాపాలను నడుపుతోందని ఇజ్రాయెల్ పదేపదే ఆరోపిస్తోంది.