- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యుద్ధంలో ఉక్రెయిన్ సోల్జర్ ప్రపోజ్ చేస్తే ఆమె ఏమందో చూడండి!
దిశ, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన దగ్గర నుండి యుద్ధ భూమిలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియా వేదికలపై కనిపిస్తున్నాయి. యుద్ధానికి సంబంధించి వినాశనాన్ని, బాధను చూపించే చిత్రాలు ఒక వైపైతే, ప్రమాదకరమైన, భయాందోళనల మధ్య ప్రజలతో పాటు యుద్ధంలో పాల్గొనే సైనికులకు కాస్త ఊరటనిచ్చే వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఇటీవల ఓ ఉక్రెయిన్ సైనికుల జంట యుద్ధ భూమిలో వివాహం చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే క్రమంలో తాజాగా మరో ఉక్రెయిన్ సోల్జర్ చెకింగ్ పాయింట్‌లో తన ప్రియురాలికి ప్రపోజ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. యుద్ధం కంటే ప్రేమ చాలా బలమైనదని చాటుతోంది.
ఈ వీడియోలో ఒక చెకింగ్ పాయింట్ దగ్గర సైనికులు కారుని ఆపి, అందులో ఉన్న నలుగుర్ని చెక్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా, ఓ సైనికుడు అందులో ఒక అమ్మాయి వెనుక మోకాలిపై కూర్చొని ఆమె కాలిని తాకుతాడు. వెనక్కి తిరిగి ఆ అమ్మాయి సైనికుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యానికి గురవుతుంది. తన ప్రేమను ప్రపోజ్ చేస్తూ, ఉంగరంతో పెళ్లి చేసుకోమని అడుగుతున్న సైనికుణ్ణి ఎంతో ప్రేమతో కౌగిలించుకుంటుంది. ఇద్దరూ తమకు ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని ముద్దుతో స్వీకరిస్తారు. ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 1.2 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి. ఈ జంటను శుభాకాంక్షలతో ముంచేస్తున్నారు నెటిజన్లు. 'యుద్ధం కాదు ప్రేమను పెంచండి..' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Kinda hard to beat this proposal: pic.twitter.com/pwNc1sC8Zf
— kendis (@kendisgibson) March 7, 2022