- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amitabh Bachchan: బిగ్ బీ అభిమాని ఇంటిని గుర్తించిన గూగుల్
దిశ, డైనమిక్ బ్యూరో: అమితాబ్ బచ్చన్ పై ఉన్న అభిమానంతో ఓ వ్యక్తి చేసిన పనికి, ఆ అభిమాని ఇంటికి గూగుల్ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి తెలియని వారు ఉండరు అనేది అతిశయోక్తి కాదు. ఆయనకు దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఉంటారు. ఈ నేపధ్యంలోనే న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో నివాసం ఉంటున్న ఇండో అమెరికన్ వ్యాపార వేత్త గోపీసేథ్ అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని, అతని పై ఉన్న అభిమానంతో రెండేళ్ల క్రితం న్యూజెర్సీలోని తన ఇంటి ముందు అమితాబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుండి దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు అమితాబ్ స్టాట్యూని చూడటానికి వచ్చేవారు. అంతేగాక అమితాబ్ తో ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఈ విషయాన్ని గమణించిన గూగుల్ సంస్థ గోపీసేథ్ ఇంటిని టూరిస్ట్ స్పాట్ గా గుర్తించింది.
దీనిని గోపీసేథ్ ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. దీనిపై గోపీసేథ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. మా నివాసం ఇప్పుడు ప్రముఖ పర్యాట కేంద్రంగా ప్రాముఖ్యత సొంతం చేసుకుందని, దానికి కారణమైన అమితాబ్ విగ్రహానికి దన్యవాదాలు తెలిపారు. అంతేగాక గూగుల్ గుర్తింపుతో పర్యాటకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని, దీంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకత పెరిగిందని గోపీసేథ్ వెల్లడించారు. గోపీసేథ్ తో పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా అమితాబ్ అంటే అమితమైన అభిమానం. 1991 లో బిగ్ బీని కలిశామని, ఆయన తమలో ఎంతో స్పూర్తిని నింపాడని, ఆయనపై ఉన్న అభిమానంతోనే 2022లో తన ఇంటి ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని, మా కుటుంబానికి దేవుడితో సమానం అని గోపీసేథ్ అన్నాడు.