బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి!

by Hajipasha |
బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి!
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌ (ఏఐ) యుగం ఇది. తొలిసారిగా ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి పోటీ చేయబోతున్నాడు. బ్రిటన్‌లో జులై 4న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ‘‘ఏఐ స్టీవ్‌’’ అనే ఏఐ అవతార్ ఇతర అభ్యర్థులతో తలపడనుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బ్రిటన్ వ్యాపారవేత్త స్టీవ్‌ కాట్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆయన తన ఆలోచనను మార్చుకున్నారు. అచ్చం తనలాగే ఉండే ఏఐ అభ్యర్థిని ఎన్నికల్లో పోటీకి నిలపాలని స్టీవ్ కాట్ డిసైడ్ అయ్యారు. ‘‘ఏఐ స్టీవ్‌’’ పేరుతో నామినేషన్‌ ఫామ్‌ను సమర్పించి ఎన్నికల బరిలోకి ఆయన దిగారు.

ఈ ఎన్నికల్లో ‘ఏఐ స్టీవ్‌’ గెలిస్తే వర్చువల్‌ అభ్యర్థికి బదులుగా స్టీవ్‌ కాట్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేస్తారని బ్రిటన్ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.ఈ సంచలన నిర్ణయంతో బ్రిటన్‌ ఎన్నికలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ ఎన్నికల తర్వాత సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి.. దేశవ్యాప్తంగా ఏఐ అభ్యర్థులను తీసుకొస్తానని స్టీవ్‌ అంటున్నారు. కాగా, 2022లో కన్జర్వేటివ్‌ పార్టీ తరపున స్థానిక ఎన్నికల్లో పోటీచేసిన స్టీవ్‌ ఓడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed