Waqf Bill: వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశం.. ప్రతిపక్ష నేతల వాకౌట్

by vinod kumar |
Waqf Bill: వక్ఫ్ బిల్లుపై జేపీసీ సమావేశం.. ప్రతిపక్ష నేతల వాకౌట్
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill)పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(Jpc) చైర్మన్, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ (Jagadhaambika pal) అధ్యక్షతన సోమవారం మరోసారి సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్ నుంచి ప్రతిపక్ష నేతలు(Apposition Leaders) వాకౌట్ చేశారు. ప్యానెల్ ఎదుట హాజరైన ఢిల్లీ వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్ (Delhi Waqf Board Administrater) ఢిల్లీ ప్రభుత్వానికి తెలియకుండా ప్రదర్శనలో మార్పులు చేశారని వారు ఆరోపించారు. సమావేశం నుంచి వాకౌట్ చేసిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) ఎంపీ సంజయ్ సింగ్(Sanjaysingh), ద్రవిడ మున్నేట్ర కజగం (Dmk)కు చెందిన మహ్మద్ అబ్దుల్లా, (mohammad abdhullah), కాంగ్రెస్‌ (congress) కు చెందిన నసీర్ హుస్సేన్(Naseer Hussain), మహ్మద్ జావేద్(mohammad javed)లు ఉన్నారు.

సీఎం అతిశీ(Athishi) ఆమోదం లేకుండానే ఎంసీడీ కమిషనర్, ఢిల్లీ వక్ఫ్ బోర్డు నిర్వాహకుడు అశ్విని కుమార్(Ashwini kumar) వక్ఫ్ బోర్డు ప్రాథమిక నివేదికను పూర్తిగా మార్చారని తెలిపారు. అందుకే మీటింగ్ నుంచి వాకౌట్ చేసినట్టు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుపై మౌఖిక ఆధారాలను నమోదు చేసేందుకు ఢిల్లీ వక్ఫ్ బోర్డు(Delhi Waqf Board), హర్యానా వక్ఫ్ బోర్డు(Haryana Waqf board), పంజాబ్ వక్ఫ్ బోర్డు(Panjab Waqg board), ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు(Utharakhand waqf boadr) ప్రతినిధులను జేపీసీ కమిటీ(Jpc commitee) మీటింగ్‌కి ఆహ్వానించింది. కమిటీ కాల్ ఫర్ జస్టిస్, వక్ఫ్ టెనెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఢిల్లీ, హర్బన్స్ డంకెల్, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ అభిప్రాయాలను పంచుకునేందుకు పిలుపునిచ్చింది.

కాగా, గతంలో కమిటీ సమావేశం ఈ నెల 22న జరిగింది. ఆ సమావేశంలో బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ (Abhijith gangopadyaya), తృణమూల్ కాంగ్రెస్ (Tmc) ఎంపీ కల్యాణ్ బెనర్జీ(kalyan benarjee) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చర్చ సందర్భంగా కళ్యాణ్ బెనర్జీ గాజు సీసాని పగలగొట్టడంతో మీటింగ్ రసాభాసగా మారింది. అప్పటి నుంచి జేపీసీ సమావేశాలను బహిష్కరించిన విపక్ష సభ్యులు తాజాగా మీటింగ్‌కి హాజరై వాకౌట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed