Stock Market: దూసుకుపోతున్న ఇండియన్ స్టాక్ మార్కెట్.. రూ.6 లక్షల కోట్ల మేర పెరిగిన లాభాలు

by karthikeya |
Stock Market: దూసుకుపోతున్న ఇండియన్ స్టాక్ మార్కెట్.. రూ.6 లక్షల కోట్ల మేర పెరిగిన లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్ది రోజులుగా భారీ నష్టాలు చవి చూసిన భారత స్టాక్‌ మార్కెట్‌ (Stock market) ఈ రోజు (సోమవారం) ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి పాజిటివ్స్ సైన్స్ కనపడడం, కనిష్ఠ ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూడంతో ఏకంగా రూ.6 లక్షల కోట్ల సంపద పెరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) ఓ దశలో 1100 పాయింట్లు, నిఫ్టీ (Nifty) దాదాపు 300 పాయింట్ల మేర లాభపడ్డాయి.

మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ 909 పాయింట్ల లాభంతో 80,311.44 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 234.75 పాయింట్ల లాభంతో 24,415.55 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభాల్లో ముందున్నాయి.

టెక్‌ మహీంద్రా, కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మాత్రం ఇంకా నష్టాల నుంచి బయటపడలేదు. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.5.7 లక్షల కోట్లు పెరిగి రూ.442.66 లక్షల కోట్లకు చేరుకుంది.

ఇక ఈ పెరుగుదలకు ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

  1. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి (Israel Attack on Iran) చేసినా చమురు, అణుకేంద్రాల జోలికి వెళ్లకపోవడంతో చమురు లభ్యతపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో స్వల్పంగా ఉత్పత్తి పెరగడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర నేడు (సోమవారం) 3 డాలర్లు తగ్గి 72 డాలర్ల వద్ద ఉంది. ఈ తగ్గుదల మన మార్కెట్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపించింది.
  2. కొద్ది రోజులుగా విదేశీ మదుపర్ల అమ్మకాలు, బలహీన త్రైమాసిక ఫలితాల కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ఉండడంతో నేడు మార్కెట్ మొదలవగానే మదుపర్లు ఎక్కువ ఆసక్తి చూపించారు.
  3. ఆసియా మార్కెట్లు (Asia Stock Exchanges) లాభాలతో ప్రారంభం కావడం వల్ల భారతీయ మార్కెట్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ పడింది. ఫలితంగా కొనుగోళ్లు పెరిగి మార్కెట్ లాభాల బాట పట్టింది.
Advertisement

Next Story

Most Viewed