Harish Rao: పత్తి రైతులను ప్రభుత్వం కష్టాలు పెడుతోంది.. మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్

by Shiva |
Harish Rao: పత్తి రైతులను ప్రభుత్వం కష్టాలు పెడుతోంది.. మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అనేక కష్టాలు పెడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పత్తి (Cotton)కి మద్దతు ధర ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. ఎక్కడా చూసినా ఏ పంటకు మద్దతు ధర అనేదే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ (Adilabad), వరంగల్ (Warangal), ఖమ్మం (Khammam) జిల్లాల్లో పత్తి రైతులు (Cotton Farmers) రోడ్డెక్కిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలే దర్శనమిస్తున్నాయని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతలు (Congress Leaders) నోటికొచ్చిన విధంగా హామీలు ఇచ్చారని ఆక్షేపించారు. నేడు ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నాని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వంపై ఆయా వర్గాలు తిరగబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు (Bathukamma Sareees) రెండు ఇస్తామని.. ఒక్కటి కూడా ఇవ్వలేదని అన్నారు. రైతుబంధు (Raithu Bandhu) కింద మూడు పంటలకు రూ.15 ఇస్తామని చెప్పారని ఇప్పడు ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు.

వరికి బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పత్తి రైతులతో సహా మొక్కజొన్న (Corn), సోయాబీన్ (Soybean) రైతులు కూడా మోసం పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టలేదని అన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కనీసం రేవంత్ ప్రభుత్వం (Revanth Government) 20 వేల ఉద్యోగాలైనా ఇచ్చిందా అని హరీష్ రావు ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed