Shabbir Ali : కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలి.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్

by Ramesh N |
Shabbir Ali : కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలి.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కేటీఆర్ నార్కోటిక్ టెస్టులకు వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ Shabbir Ali సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ ఆరోపణలు మాపై ఎందుకు రావడం లేదు? మాటిమాటికి డ్రగ్స్‌కు కేటీఆర్‌కు ఏమి సంబంధం.. ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో పీసీసీ ప్రెసిడెంట్‌గా Revanth Reddy సీఎం రేవంత్ చాలెంజ్ చేశారని, ఇద్దరం Narcotic Tests నార్కోటిక్ టెస్ట్ చేయించుకుందామని అన్నారు.. మీరు పారిపోయారు.. అని షబ్బీర్ అలీ విమర్శించారు. ఇప్పుడు కూడా చెబుతున్నా.. ఒకసారి నార్కోటిక్ టెస్ట్ చేయించుకుంటే నీ మీద ఉన్న ఆరోపణలు పోతాయి కాదా? అని సూచించారు. రాజకీయంలో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తాయని అన్నారు. దాని ప్రజల ముందుకు పోయి నిరూపించుకోవాలని వెల్లడించారు. నార్కొటిక్ ఆఫీస్‌కు వెళ్లి డ్రగ్స్ టెస్టు చేయించుకోని సర్టిఫికేట్ సంపాదించుకోవాలని సూచించారు. నాకు డ్రగ్స్‌కు సంబంధం లేదు.. ఇది కేవలం రాజకీయ ఆరోపణలు అని చెబితే అయిపోతుందన్నారు.

పార్టీలో ఫారిన్ లిక్కర్ ఎక్కడ నుంచి వచ్చింది

జన్వాడ ఫామ్‌హౌస్‌ Janwada Farm House rave party పార్టీలో కేటీఆర్ బావమారిది లిక్కర్, పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేటీఆర్ ఆలస్యంగా స్పందించారని, ఇది ఫ్యామిలీ పార్టీ అని, లిక్కర్ తాగారని మాట్లాడుతున్నారని వ్యాఖ్యనించారు. సిగ్గు శరం ఉందా? కేటీఆర్.. పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తివి.. అక్కడ డ్రగ్స్ తీసుకున్నారని ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందన్నారు. అక్కడ పార్టీ ఇల్లీగల్‌గా జరిగిందని, పార్టీలో ఫారిన్ లిక్కర్ ఎక్కడ నుంచి వచ్చిందని, దానికి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలి

అదేవిధంగా కేసీఆర్ KCR కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో తెలంగాణ ప్రజలకు తెలియాలన్నారు. ప్రజాధనాన్ని లూటీ చేసి ఇంటికొక్క ఫామ్‌హౌస్ కట్టుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఆ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాని కేటీఆర్‌కు సవాల్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed