- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
crime news : నిజామాబాద్ నగరంలో కత్తిపోట్ల కలకలం..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో సోమవారం పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తి కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ ఘటన నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ( 3 Town Police Station ) పరిధిలోని శివాజీ చౌక్ లో వద్ద జరిగింది. కత్తిపోట్లలో గాయపడిన విశ్వనాథ్ కు తీవ్రంగా రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని పోలీసులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కత్తిపోట్ల ఘటనలో బాధితుడు విశ్వనాథ్ కు నిందితుడు భాస్కర్ రూ. 5 వేలు బాకీ ఉన్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని భాస్కర్ పై విశ్వనాథ్ ఒత్తిడి చేయసాగాడు. దీంతో దీన్ని మనసులో పెట్టుకుని కోపంతో భాస్కర్ విశ్వనాథ్ ను కత్తితో పొడిచి గాయపరిచినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవలి కాలంలో నగరంలో కత్తిపోట్ల ఘటనలు తరచూ జరుగుతుండటం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.