అగ్ని పర్వతం బీభత్సం..24గంటల్లోనే ఐదు సార్లు విస్పోటనం: ఎయిర్ పోర్టు మూసివేత

by samatah |
అగ్ని పర్వతం బీభత్సం..24గంటల్లోనే ఐదు సార్లు విస్పోటనం: ఎయిర్ పోర్టు మూసివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలోని ఉత్తర సలవేసి ప్రావీన్సులోని రువాంగ్ అగ్నిపర్వతం బద్దలైన విషయం తెలిసిందే. అయితే గత 24గంట్లోనే అగ్ని పర్వతం ఐదు సార్లు భారీగా విస్పోటనం చెందింది. లావా వేల అడుగుల ఎత్తులోకి ఎగిసిపడుతుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సమీప ప్రాంతాల్లోని సుమారు 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిపర్వతం నుండి కనీసం ఆరు కిలోమీటర్లు దూరం ఉండాలని పర్యాటకులు, ప్రజలను ఆదేశించారు. అంతేగాక అగ్నిపర్వతానికి సమీపంలోని ఇండోనేషియా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 24గంటల పాటు మూసివేశారు. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఈ ప్రాంతంలో మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉన్నందున ద్వీపాన్ని పూర్తిగా తొలగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విస్ఫోటనాలు సంభవించిన ప్రదేశానికి 4 కిలోమీటర్ల దూరంలో ఎటువంటి కార్యకలాపాలు అనుమతింబబోమని తెలిపారు. కాగా, 270 మిలియన్ల జనాభా కలిగిన ఇండోనేషియాలో 120 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే అగ్నిపర్వత విస్పోటనాలకు ఎక్కువ గురవుతూ ఉంటుంది. టెక్టోనిక్ ప్లేట్లలో అస్థిరతకు కారణమైన ఇటీవలి రెండు భూకంపాల కారణంగా రువాంగ్‌లో అగ్నిపర్వత కార్యకలాపాలు పెరిగాయని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed