సిరియాలోని మార్కెట్‌లో కారు బాంబ్ పేలుడు.. 8 మంది మృతి

by Harish |
సిరియాలోని మార్కెట్‌లో కారు బాంబ్ పేలుడు.. 8 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సిరియాలో దారుణం చోటుచేసుకుంది. టర్కీ అనుకూల బలగాల ఆధీనంలో ఉన్న ఉత్తర సిరియాలోని అజాజ్ నగరంలోని మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున కారులో అమర్చిన బాంబు పేలడంతో ఎనిమిది మంది మృతి చెందగా, ముప్పై మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్కెట్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రంజాన్ మాసం కాబట్టి, ఉపవాసం విరమించి అర్ధరాత్రి షాపింగ్ చేసే సమయంలో పేలుడు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సర్వీసెస్‌ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వాయువ్య సరిహద్దు ప్రాంతంలోని ప్రధాన పట్టణాల్లో ఇటీవలి సంవత్సరాలలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబు దాడులు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ పట్టణం ఎక్కువ అరబ్-మెజారిటీతో నిండి ఉంటుంది.

సిరియా వివాదం 2011లో శాంతియుత నిరసనలను ప్రభుత్వ అణిచివేయడంతో ప్రారంభమైంది, ఇప్పటి వరకు యుద్ధంలో 5,07,000 మంది ప్రాణాలు కోల్పోగా, లెక్కలేనంత మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. అలాగే, దేశం మౌలిక సదుపాయాలు నాశనం అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed