సముద్రంలో చిక్కుకున్న పడవ.. 24 రోజులు కెచప్ తిని..

by Sathputhe Rajesh |
సముద్రంలో చిక్కుకున్న పడవ.. 24 రోజులు కెచప్ తిని..
X

దిశ, వెబ్‌డెస్క్: సముద్రంలో పడవ చిక్కుకు పోవడంతో ఓ నావికుడు 24 రోజులు కెచప్ తిని ప్రాణాలు కాపాడుకున్నాడు. డొమినికా వాసి ఎల్విస్ ఫ్రాంకోయిస్ గత డిసెంబర్ లో పడవలో కరేబియన్ ద్వీపం సెయింట్ మార్టిన్ వద్ద ఉన్న సమయంలో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున పెనుగాలులు వీచాయి. వాటి ధాటికి పడవ ఒడ్డు నుంచి సముద్రంలోకి కొట్టుకుపోయింది. పడవలో ఒక కెచప్ సీసా, వెల్లుల్లి పౌడర్, కొంచెం మ్యాగీ మాత్రమే ఉండగా అవి తినే అతను 24 రోజులు గడిపాడు.

జనవరి 15న ఓ హెలికాప్టర్ తన పడవపై ఎగురుతూ వెళ్లడం ఫ్రాంకోయిస్ గమనించాడు. వెంటనే పడవలోని చిన్నపాటి అద్దం బయటకు తీసి దానిపై సూర్యరశ్మి పడి ఆ వెలుతురు హెలికాప్టర్ లో ఉన్నవారికి తాకేలా చేశాడు. ఫ్రాంకోయిస్ ను గమనించిన కొలంబియా నేవి హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న వారు అతన్ని కాపాడారు. సరైన తిండి లేకపోవడం బలహీనంగా మారిన ఫ్రాంకోయిస్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.

Advertisement

Next Story