- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
139 కి.మీ. సైకిల్ తొక్కి మరీ తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు...
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఇంట్లో ఏదో ఒక విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై కొప్పడుతుంటారు. ఆ చిన్నారులు నాయనమ్మకో, అమ్మమ్మకో, తాతయ్యలతో ఫిర్యాదు చేయడం చూస్తునే ఉంటాం. అయితే తాజాగా చైనాకు చెందిన 11 ఏళ్ల ఓ చిన్నారి ఏదో విషయంలో తల్లితో గొడవపడి.. అమ్మమ్మకు ఫిర్యాదు చేయడానికి సైకిల్‌పై 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిజియాంగ్‌కు వెళ్లాడు. ఆ బాలుడ్ని తల్లి తిట్టడంతో మనస్థాపానికి గురై.. ఎలాగైనా తల్లిని అమ్మమ్మతో తిట్టించాలనుకొని అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. కానీ ఎలా వెళ్లాలో తెలియదు.
అయినా పట్టుదలతో తన దగ్గర ఉన్న వాహనం సైకిల్ మీదే ప్రయాణం మొదలుపెట్టాడు. రోడ్డు మీద ఉండే గుర్తుల సహాయంతో వెళ్లసాగాడు. వెళ్లేటప్పుడు ఆ చిన్నారితో పాటు బ్రెడ్, మంచినీళ్లు తీసుకెళ్లాడు. దారిలో వాటితో ఆకలి తీర్చుకున్నాడు. అలా ఏకంగా 130కి.మీ. వెళ్ళాడు. సరిగా రూటు తెలియక మధ్యలో దారి తప్పాడు. ఒక్క రోజులో చేరుకోవాల్సింది, రెండు రోజులు అయినా చేరుకోలేకపోయాడు. సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయి నడవలేని స్థితిలోకి చేరాడు. ఓ దగ్గర అలిసిపోయి ఒంటరిగా కూర్చున్నాడు. ఆ బాలుడిని చూసిన కొందరు.. పోలీసులకు సమాచారమిచ్చారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి వివరాలు కనుక్కున్నారు. చిన్నారి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయారు. ఆ పిల్లాడి సాహసానికి షాక్ అయ్యారు. ఆ చిన్నారిని తమ కారులో ఎక్కించుకొని, దగ్గర్లోని స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పజెప్పారు. బాలుడి తల్లిదండ్రులకు, అమ్మమ్మకు విషయాన్ని తెలిపారు. కుమారుడిని వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న తల్లి.. చిన్నారిని కోప్పడిన తర్వాత కోపంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపో అని బెదిరించినట్లుగా తెలిపారు. కానీ నిజంగానే అలా చేస్తాడని అనుకోలేదని చెప్పారు. రాత్రిపూట కూడా భయపడకుండా బాలుడు ప్రయాణించిన తీరును చాలామంది మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ స్టోరీ వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: