- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pakistan: కొండచరియలు విరిగిపడి 12 మంది కుటుంబ సభ్యులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది. తాజాగా శుక్రవారం కుంభవృష్టిగా కురిసినటువంటి వర్షానికి వాయువ్య పాకిస్థాన్‌లో ఓ ఇంటిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ ఇంట్లో ఉన్నటువంటి తొమ్మిది మంది పిల్లలతో సహా కుటుంబంలోని 12 మంది సభ్యులు మరణించారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీసి ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్థానికంగా ఉండే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు.
మరోవైపు వచ్చే 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పాకిస్తాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. సింధ్, ఈశాన్య దక్షిణ బలూచిస్తాన్, ఈశాన్య మధ్య పంజాబ్, పొటోహార్ ప్రాంతం, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ముర్రే, గల్లియత్, మన్సెహ్రా, కోహిస్తాన్, చిత్రాల్, దిర్, స్వాత్, షాంగ్లా, బునేర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడవచ్చని అధికారులు తెలిపారు.