పిల్లుల నియామకం కోసం 12 లక్షల రూపాయలు కేటాయించిన దేశం.. ఎక్కడంటే..?

by Maddikunta Saikiran |
పిల్లుల నియామకం కోసం 12 లక్షల రూపాయలు కేటాయించిన దేశం.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: మన దాయాది దేశం పాకిస్తాన్‌ కొన్ని ఏళ్ల నుండి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు చాల రోజుల నుండి ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉన్న సమస్యలు చాలవు అన్నట్లు ఇప్పుడు పాకిస్తాన్‌కు మరో కొత్త సమస్య వచ్చి పడింది.గత కొన్ని రోజుల నుండి పాక్ పార్లమెంట్‌లో ఎలుకల సంచారం చాలా పెరిగిపోయింది. ఎలుకల బెడద పెరిగి పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. అలాగే పార్లమెంట్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా పాడు చేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఎలుకల నివారణ కోసం పార్లమెంట్‌లో పిల్లులను పెంచాలని నిర్ణయించింది. పిల్లుల కోసం ఏకంగా 12 లక్షల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది.వాటికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చి పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఉంచనున్నారు.

కాగా పాకిస్తాన్ దేశం ఇప్పటికే తీవ్ర ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది.అక్కడి ప్రజలు తిందామంటే తినేందుకు కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి. ఇవేగాక ద్రవ్యోల్భణం,రాజకీయ అస్థిరతను పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. దీనికి తోడు ఆ దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయింది.అలాగే గత కొన్ని నెలల నుండి ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతోంది. ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ తాజాగా ఎలుకలను నివారించేందుకు పిల్లుల కోసం లక్షల్లో డబ్బు ఖర్చు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

Next Story

Most Viewed